ఏపీ సీఎం వైఎస్ జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్ అందివ్వనున్నారు. మామూలుగా రేషన్ లో అందించే నాణ్యమైన బియ్యం సహా నిత్యావసరాలను ఇంటి వద్దే ఇక నుండి డెలివరీ చేయనుంది ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం.ఈ మేరకు ప్రభుత్వం 9260 వాహానాలను సిద్దం చేసినట్టు సమాచారం.
ఇప్పటికే టాటా, సుజుకి సంస్థల ద్వారా డోర్ డెలివరీ ట్రక్కుల కొనుగోళ్లు చేసినట్టు చెబుతున్నారు. ఈ నెల 21 ను ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇంటింటికి రేషన్ డెలివరీ కోసం ప్రత్యేక వాహనాలను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడ బెంజ్ సర్కిల్ లో ప్రారంభించనున్నారు. వచ్చే నెల ఒకటో తారీకు నుంచి డోర్ డెలివరీ విధానంలో రేషన్ పంపిణీ చేయనున్నారు.