బిగ్ బ్రేకింగ్ : అల్లు అర్జున్ కార్వాన్ కి యాక్సిడెంట్

-

అల్లు అర్జున్ కార్వాన్ కు ఖమ్మం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ షెడ్యూల్ లో అల్లు అర్జున్ ఉన్నారు. అయితే ప్రమాద సమయంలో అల్లు అర్జున్ కార్వాన్లో లేకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

ఇక అన్ని సినిమాల లానే పుష్ప సినిమా రిలీజ్ డేట్ కూడా సడెన్ గా ప్రకటించిన అభిమానులకి అనుకోని సర్ప్రైజ్ ఇచ్చారు. ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న పుష్ప సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు ఆ ఆసక్తిని మరింత పెంచాయి. రంగస్థలం సినిమాతో మాస్ జనాలకి దగ్గరైన సుకుమార్, పుష్ప సినిమా చేస్తుండడంతో పాటు వీరి కాంబినేషన్ మూడో సరి కావడంతో జనాల్లో ఆసక్తి నెలకొంది.  

Read more RELATED
Recommended to you

Latest news