ఈ ప్రపంచాన్ని ఏలేది తెలివైన వాళ్ళే. తెలివైన వాళ్లే ప్రశ్నించడానికి ముందుకు వస్తారు. తెలివైన వాళ్ళే ప్రశ్నల్ని సంధిస్తారు. ఐతే మీ తెలివైనవాళ్ళు చేసే కొన్ని చర్యల గురించి ఇక్కడ తెలుసుకుందాం. దీన్నిబట్టి మీరు తెలివైన వాళ్ళో కాదో తెలుసుకోండి.
20వేలు సంపాదించేవాళ్ళు 30వేల ఫోన్ కొనుక్కోరు.
లోన్ మీద కారు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఆలోచిస్తాడు. ఎంతపడితే అంతిస్తారని చెప్పి ఇష్టం తన తాహతుకి మించి లోన్ తీసుకోడు. ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించలేమని అతడికి తెలుసు. కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం వచ్చినా లోన్ కట్టుకునే ఇతర ఆదాయ మార్గాలు చూసుకుంటాడు.
సమయాన్ని బాగా వృధా చేసే వాట్సాప్, ఫేస్ బుక్, నెట్ ఫ్లిక్స్ వంటి వాటిపై కాలం గడపడు.
వాటిపై కాలం గడిపే సమయం కూడా చాలా ప్రోడక్టివ్ గా ఉండేలా చూసుకుంటాడు.
ఖరీదైన వస్తువులు, ఖరీదైన కార్లు, ఖరీదైన బట్టలు మొదలగు వాటిపై ఎక్కువ పెట్టుబడి పెట్టడు.
తన వ్యక్తిగత విషయాలని ఎవరితోనూ పంచుకోడు. ముఖ్యంగా తన ఇంటి విషయాలని తనతోనే ఉంచుకుంటాడు.
సమయపాలన చాలా ఎక్కువ. ఇతరుల సమయానికి గౌరవం ఇస్తాడు. ఇతరులు కూడా అలా ఇవ్వాలని కోరుకుంటాడు.
భవిష్యత్తులో రాబోయే రాబడి మీద అప్పు చేయడు. క్షణ క్షణానికే కాలం మారిపోతుంది కాబట్టి ఎప్పుడు ఏదైనా జరగవచ్చని అతడికి తెలుసు.
తెలివైన వాళ్ళు తమ ఆరోగ్యం గురించి బాగా ఆలోచిస్తారు. ఆరోగ్యం బాగుంటేనే అంతా బాగుంటదని వారికి తెలుసు.
తప్పులు చేయని వాళ్ళు ఎవరూ ఉండరని వాళ్లకి తెలుసు. కానీ చేసిన తప్పే చేయకూడదని వాళ్ళకి ఇంకా బాగా తెలుసు.