ప్రధాని టీంలోని ఓ సభ్యుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చి, రైతు వ్యతిరేక చట్టాలపై అసెంబ్లీలో తీర్మాణనం చేసి పంపాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షడు ఎనుముల రేవంత్ రెడ్డి ధ్వసమెత్తారు. రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర మంగళవారం రంగారెడ్డి రావిర్యాలకు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ భూసేకరణ పేరుతో మూడు పంటలు పండే భూములకు ఎకరాకు దాదాపుగా 15 నుంచి 16 లక్షల దాకా సేకరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర తీసుకువచ్చిన రైతు నూతన చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌బంద్‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్, దిల్లీ వెళ్లి మోదీని కలిశాక ఒక్కసారి కూడా బటయకు రాకుండా ఫాంహౌస్‌కే పరిమితమవ్వడం వెనక అసలు కారణమేంటని ప్రశ్నించారు.
కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం..
వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్న రైతు బిడ్డల భూములను కార్పొరేట్ సంస్థలకు దారతత్తం చేసేందుకు గుజరాజ్ బేరగాళ్లు మోదీ, అమిత్‌షా, దళారులు అదాని, అంబానీలు సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను సీఎం పదవి నుంచి దించడమే తన లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నానన్నారు. వైఎస్‌ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రమంతటా పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపేందుకు అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ అధిష్ఠానం అనుమతితో రోడ్‌మ్యాప్ ఖారారు చేయించుకొని త్వరలోనే రాష్ట్రం నలుమూలలా పాదయాత్ర చేస్తానని ఈ సందర్భంగా రేవంత్ స్పష్టం చేశారు.