ఏపీ సీఎం జగన్ కు ఊరట లభించింది. ఆయన మీద ఉన్న కేసు ఉపసంహరణకు ప్రజా ప్రతినిధుల కోర్టు అనుమతి ఇచ్చింది. ఎన్నికల నియామళి ఉల్లంఘన కేసు ఉపసంహరణకు కోదాడ పోలీసులకు అనుమతి ఇచ్చింది ప్రజా ప్రతినిధుల కోర్టు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని 2014లో జగన్ పై కేసు నమోదు అయింది.
అయితే జగన్ పై ఛార్జ్ షీట్ ఇటీవల ప్రజా ప్రతినిధుల కోర్టుకు బదిలీ అయింది. దీంతో జగన్ పై కేసు ఉపసంహరణకు అనుమతివ్వాలని కోదాడ పోలీసులు కోరారు. ఏ2, ఏ3పై కోదాడ కోర్టు కేసు కొట్టివేసిందని కోదాడ పోలీసులు తెలిపారు. 2014లో ఫిర్యాదు చేసిన ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి వాంగ్మూలం కూడా కోర్టు నమోదు చేసింది. ప్రభుత్వం నిర్ణయించినందున కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని ఎంపీడీఓ పేర్కొన్నారు. ఇక జగన్ పై ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు కూడా ప్రజా ప్రతినిధుల కోర్టు అనుమతి ఇచ్చింది.