రేవంత్ రెడ్డి పాదయాత్రతో సీనియర్లు సైడయ్యారా ?

Join Our Community
follow manalokam on social media

రేవంత్‌ రెడ్డి యాత్ర తెలంగాణ కాంగ్రెస్‌ పై గట్టి ప్రభావమే చూపించింది. రేవంత్‌రెడ్డి నిర్వహించిన రణభేరి సభతో కాంగ్రె్‌సలో ఎవరు ఎటువైపు ఉన్నారన్న అంశంపై కొంత స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. పాదయాత్ర చేయడమే పెద్ద ఇష్యూ అంటే, పాదయాత్ర ముగింపు సభలో రేవంత్ చేసిన కామెంట్స్‌ కాంగ్రెస్ లో మరో పెద్ద చర్చకు కారణమయ్యాయి.బహిరంగ సభతో రేవంత్ బల ప్రదర్శన..సీనియర్ల గైర్హాజరు తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారాయి.

రావిరాల పాదయాత్ర ముగింపు సభలో వేదిక మీద నాయకులను చూస్తే ఇప్పుడు జూనియర్లంతా ఒక వైపు..సీనియర్లంతా ఇంకో వైపు నిలబడినట్టయిందనే టాక్‌ వినిపిస్తోంది. పాదయాత్రకి పార్టీ అనుమతే లేదంటూ సీనియర్లు కామెంట్ చేస్తుంటే వేదిక మీద జూనియర్ నాయకులతో పాటు మాజీమంత్రి షబ్బీర్ అలీ,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, మాజీ ఎంపీలు, కొండా సురేఖ లాంటి నేతలు సభా వేదిక మీదే ఉండటం మరో విశేషం.

రణభేరి సభ జరిగే సమయంలోనే కాంగ్రెస్ సీనియర్లు ముందుగానే కార్యక్రమాలు ప్లాన్ చేసుకుని రేవంత్ సభకు డుమ్మా కొట్టారు. అదే సమయంలో ఉత్తమ్ ఎమ్మెల్సీ అభ్యర్ధి రాములునాయక్ తో హుజూర్‌నగర్‌, కోదాడల్లో కార్యక్రమం నిర్వహించగా సీఎల్పీ నేత భట్టి రైతుల పేరుతో యాత్రని జడ్చర్ల వరకు నిర్వహించారు. పార్టీ ముఖ్యులందరినీ రేవంత్‌రెడ్డి ఆహ్వానించినా జీవన్‌రెడ్డి, జానారెడ్డి,కోమటి రెడ్డి,వీహెచ్,జగ్గారెడ్డి వంటి సీనియర్లు గైర్హాజరు కావడం పార్టీ అంతర్గత విభేదాలకు మరింత ఆజ్యం పోసింది.

అయితే సీనియర్ల వ్యతిరేకత నడుమా 16 జిల్లాల డీసీసీ అధ్యక్షులతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు కుసుమ కుమార్‌, పొన్నం ప్రభాకర్‌ మాజీ మంత్రి చిన్నారెడ్డి సభలో పాల్గొన్నారు. అయితే సభ వేదిక మీద నుండి మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ హీటెక్కించాయి. సీనియర్ నాయకులను ఆమె ఓ రేంజ్ లో కడిగేశారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో కూడా సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారని చురకలు వేశారు. ఇప్పుడు రేవంత్ పాదయాత్రకు బ్రేక్ లు వేయాలని అనుకున్నారు. సభలో రేవంత్ కూడా అలాంటి దుకుడే ప్రదర్శించారు. పార్టీలో ఉన్న జూనియర్లతో పాటు..మెజారిటీ నాయకులను తన పాదయాత్ర ముగింపు వేదిక మీద ఉండేలా చూశారు.

మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, సీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అందరిని ఒకే వేదిక మీదకు తెచ్చే ప్రయత్నంలో రేవంత్ సక్సెస్‌ అయ్యారనే టాక్‌ పెరుగుతోంది. అయితే పార్టీలో ఐదారుగురు లీడర్లు తప్పితే..మిగిలిన నాయకులు అంతా తనతోనే ఉన్నారని రేవంత్‌ చెప్పుకోగలిగారనే అభిప్రాయం కార్యకర్తలో ఉంది. మరోపక్క మార్చిలో పీసీసీ చీఫ్‌ అంశం తేలిపోతుందనే చర్చ జరుగుతున్న సమయంలో రేవంత్ అధిష్టానానికి ఓ సంకేతం పంపినట్టైందనే టాక్‌ ఉంది.

 

TOP STORIES

వనదేవతల జాతర.. మినీ మేడారం

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. మండమేలిగే పండగ సందర్భంగా...