పీవీ కుమార్తెకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం మీద బీజేపీ నేత సుభాష్.. పివి మనుమడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆరెస్ పార్టీ నుంచి మా చిన్నమ్మకు టికెట్ ఇచ్చారని ఓడిపోయే సీటులో, కుటిల రాజకీయాలతో మహా మనిషి పేరు చెప్పి మా కుటుంబాన్ని మోసం చేశారుని అన్నారు. బ్రాహ్మణ సమాజ ఓట్లు చీల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇక మరో పక్క జిహెసెంసి కార్యాలయానికి వెళ్ళిన వాణి నామినేషన్ దాఖలు చేశారు.
ఆమె వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్, కేకేలు ఉన్నారు. ఇక అదే కార్యలయంలో ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు కుటుంబ పాలన కోసమే తెలంగాణ వచ్చిందా అన్నట్టుగా ఉందని విమర్శించారు. మండలిలో అన్ని అంశాల మీద గళమెత్తి హైదరాబాద్ లో వరదల సమస్యను మూడేళ్ల క్రితమే మండలిలో నిలదీశానని అన్నారు. పీవీ కుమార్తె కాదు కదా సీఎం కొడుకు నిలబడ్డా హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.