మనం ఏది ఆహారంగా తీసుకుంటున్నామో దాని తాలూకు ఫలితాలు మొహం మీద స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆల్కహాల్, చక్కెర ఎక్కువగా గల ఆహారాలు, ఉప్పు ఎక్కువగా గల ఆహారాలని తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల మొటిమలు ఏర్పడే అవకాశం ఉంది. మీ ముఖంపై మొటిమలని మొలకెత్తించే ప్రధానమైనవి ఏమైనా ఉన్నాయంటే అది ఇవే. ఇంకా కొన్ని ఆహారాలకి దూరంగా ఉండడం ఉత్తమం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాల పదార్థాలు
పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం మీద సీబమ్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. సీబమ్ ఎక్కువ అయితే మొటిమలు తొందరగా ఏర్పడతాయి. అందుకే ఏదైనా అతిగా తినకూడదని తెలుసుకోవాలి.
చాక్లెట్
సెలెబ్రేషన్ పరంగా ఎప్పుడో ఒకసారి చాక్లెట్ తినడం వల్ల మొటిమలు ఏర్పడవు కానీ, అదే పనిగా చాక్లెట్ తింటూ కూర్చుంటే ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువై మొటిమలకి దారి తీస్తుంది.
ఫాస్ట్ ఫుడ్
ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల అందులో ఉన్న నూనె ద్వారా మొటిమలు తొందరగా ఏర్పడతాయి. ఫాస్ట్ గా తినొచ్చన్న కారణంగా ఆరిగిస్తూ పోతే తొందరగా తగ్గని మొటిమలని తెచ్చిపెడుతుంటాయి.
తీపి పదార్థాలు
తీపి పదార్థాలని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మొటిమలు ఏర్పడతాయి. అన్నం తిన్నాక చక్కెర వస్తువులు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలాంటప్పుడు ఆగకుండా తినేసి మొటిమలని తెచ్చుకుంటారు. పై ఆహారాలకి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన నియమాలు పాటిస్తే మొటిమలు ఏర్పడకుండా సహజంగా ఉండడమే కాకుండా మెరిసే గుణం వస్తుంది.