ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎల్లుండితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన నేపథ్యంలో కీలక నేతలు అందరూ రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెలుగు దేశానికి చెందిన కీలక నేతలు తమ తమ ప్రాంతాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించి పలువురు కీలక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం అందరూ రంగంలోకి దిగి తమ తమ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
సొంత జిల్లాలో కూడా మంత్రులు ప్రచారం చేస్తున్నారు అలాగే ఎమ్మెల్యేలు సైతం అభ్యర్థులను వెంటేసుకుని ప్రచారం చేస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇక జిల్లాల ఇంచార్జ్ మంత్రులు సైతం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఎన్నికల్లో గెలుపు ఎగరవేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇక ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ జనసేనలు సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అయితే జనసేన తరఫున కీలక నేతలు ఎవరూ ప్రచారంలో పాల్గొనడం లేదు.