ప్రచారానికి నో అంటున్న పవన్…?

-

తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బరిలోకి దిగడంతో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడానికి బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్న ఆయన మాత్రం దూరంగా ఉండే అవకాశం ఉంది. తిరుపతి పార్లమెంటు పరిధిలో చాలావరకు జనసేన పార్టీకి అండగా ఉండే కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నా సరే జనసేన పార్టీ అన్యాయం జరిగింది.

దళిత సామాజిక వర్గాలు కూడా జనసేన పార్టీకి ముందు నుంచి కూడా దగ్గరగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అన్యాయం జరగడంతో ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినా సరే ఆయనకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉండకపోవచ్చు. జనసేన పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నారు అనే ఆవేదన కూడా కొంత మంది కార్యకర్తలలో ఉంది. దీనితో వాళ్లు కూడా విజయ్ తిరుపతి పార్లమెంటు పరిధిలో కష్టపడే పరిస్థితి లేకపోవచ్చు.

దీంతో ఇప్పుడు బీజేపీ చూపించే ప్రభావం పై సర్వత్రా కూడా ఆసక్తికరంగా ఉంది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో అక్కడి నేతలు ఎక్కువగా జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేసి ఉంటే అదే స్థాయిలో కష్టపడి ఉండే వాళ్ళు. కానీ పక్కన పెట్టడంతో ఇప్పుడు వాళ్ళు అందరు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి అగ్రనేతలు ఎంత ప్రచారం చేసినా సరే తిరుపతిలో ప్రయోజనం ఉండే అవకాశం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news