వామనరావు దంపతుల హత్య కేసు మీద స్పందించిన కేసీఆర్

-

తెలంగాణలో సంచలనం రేపిన లాయర్ వామన రావు దంపతుల హత్య మీద ఎట్టకేలకు కేసీఆర్ స్పందించారు. ఈ కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని ఇప్పటికే ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారని అన్నారు. అందులో మా మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నారు అని ఆయనని సస్పెండ్ చేశాం అని అన్నారు. తప్పకుండా ఎవరు ఉన్నా రాజి లేకుండా విచారణ చేస్తామని ఎవరికి ఏ అనుమానాలు అవసరం లేదని అన్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

ప్రాజెక్టుల భూసేకరణ పరిహారం చట్టాన్ని అనుసరించి ఇస్తున్నామని, ఎస్ ఆర్ ఎస్ పి తర్వాత భారీ నీటి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు గంధ మల్ల రిజర్వాయర్ అని అన్నారు. జూన్ లోపు గంధ మల్ల రిజర్వాయర్ పూర్తి చేస్తామన్న ఆయన జయ జయ తెలంగాణ రాష్ట్ర  గీతం కాదు…రాసుకున్నప్పుడు పాడిస్తామని అన్నారు.  గవర్నర్ ప్రభుత్వం రాసి ఇచ్చినదే చదువుతారు…భట్టి విక్రమార్క ఇచ్చింది చదువరు కదా ? అని ప్రశ్నించారు. ఆర్థిక క్రమశిక్షణ ఉన్న రెండు మూడు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని కేంద్రం చెప్పిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news