జాతీయ సినిమా పురస్కారాలు: జెర్సీకి రెండు, మహర్షి రెండు..

-

67వ జాతీయ సినిమా పురస్కారాలని కేంద్ర ప్రభుత్వం ఈరోజే ప్రకటించింది. 2019సంవత్సరానికి గాను 2020లోనే ప్రకటించాల్సింది కాగా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. తెలుగు నుండి రెండు సినిమాలకి నాలుగు అవార్డులు వచ్చాయి. నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కగా, అదే సినిమాకి ఉత్తమ ఎడిటర్ గా నవీన్ నూలి అవార్డు దక్కించుకున్నాడు. ఇక మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాకి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు దక్కింది.

అలాగే అదే సినిమాలో ఉత్తమ కొరియోగ్రఫీకి రాజు సుందరం మాస్టర్ కి అవార్డు వచ్చింది. రాజు సుందరం అవార్డు అందుకోవడం ఇది రెండవ సారి. జెర్సీ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా కనిపించింది. వంశీ పైడిపల్లి మహర్షి సినిమాకి దర్శకత్వం చేయగా పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఐతే ఉత్తమ నటులుగా తమిళ నటుడు ధనుష్, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ పురస్కారం దక్కించుకున్నారు. ఉత్తమ నటిగా మణికర్ణిక చిత్రానికి కంగనా రనౌత్ అవార్డు అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news