ఏపీ సీఎం జగన్ ఎన్నిక అయిన నాటి నుంచి కొత్తగా చేసింది ఏమీ లేదని అన్నీ మేము చేస్తున్న పథకాలు మర్చి జనాన్ని ఏమారుస్తున్నాడని టీడీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. వారు అనే దానికి తగ్గట్టే జగన్ కూడా చేస్తూ ఉంటారు. తాజాగా కర్నూలు ఎయిర్ పోర్ట్ ను సీఎం జగన్ నేడు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం…మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ప్రారంభిస్తారు. నిజానికి 2019 ఎన్నికలకు ముందు నాటి సీఎం చంద్రబాబు..ఈ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఓర్వకల్లు సమీపంలో 2017 జూన్‌లో శంకుస్థాపన చేసి..2019 నాటికి 90 శాతం పనులు పూర్తిచేసి 2019 జనవరి 8న అధికారికంగా ప్రారంభించారు. అయితే ఎన్నికలు రావడం, కాంట్రాక్టర్ పనులు ఆపడంతో ప్రయాణికులకు అనువుగా విమాన సర్వీసులను అందుబాటులోకి తేవడం ఆలస్యమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్యాసింజర్ టెర్మినల్, రన్‌వే, వీఐపీ లాంజ్, సెక్యూరిటీ బ్యారక్ లాంటి పెండింగ్ పనులు పూర్తిచేశారు. అయితే ఈ ఇప్పటి దాకా వివిధ రాజకీయ పార్టీల నేతల కోసం ఇక్కడి నుంచి ఇప్పటి దాకా 36 సార్లు ఫ్లైట్ ఎగిరింది. అయితే కేవలం సాధారణ ప్రయాణికులకు ఈ ఎయిర్ పోర్ట్ ఇక మీదట అందుబాటులోకి రానుంది. ఉడాన్ పథకంలో భాగంగా ఇండిగో సంస్థ తమ సర్వీసులను ఈనెల 28 నుంచి ప్రారంభించనుంది. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైకి..విమాన సేవలు మొదలుపెట్టి సర్వీసులు విస్తరించనున్నారు.