ఎస్బీఐ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే క్రెడిట్ కార్డు ద్వారా తమ వినియోగదారులకు ఓ అద్భుతమైన ఈఎంఐ ఆఫర్‌ను ప్రకటించింది. దీంతో క్రెడిట్ కార్డు వాడుతున్న ఎస్బీఐ ఖాతాదారులు వారికి నచ్చిన వస్తువులను కొనుక్కోవడంతో పాటు ఆ లావాదేవీలను ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు. ఈ అద్భుతమై ఆఫర్ ఎస్బీఐ ఖాతాదారులకు, వారు క్రెడిట్ కార్డు వాడుతున్నవారు అర్హులు. అయితే మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎస్బీఐ ఖాతాదారులు వారి లావాదేవీలను సులభ వాయిదా పద్ధతుల్లోకి మార్చుకునే సౌలభ్యం ఉంది.
- ఎస్బీఐ ద్వారా జరిపిన లావాదేవీలను 6,9,12,24 వాయిదాల్లోకి మార్చుకోవచ్చు.
- ఈఎంఐ రూ.1000 ఉంటే రూ.52 నుంచి ప్రారంభమవుతుంది. ట్రాన్సాక్షన్ జరిపిన 30 రోజుల్లోగా దాన్ని ఈజీ ఈఎంఐలోకి మార్పు చేసుకోవాలి.
- ఎస్బీఐ కార్డు ఆన్లైన్ ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. లేదా 567673 నంబర్‌కు ఎఫ్పీ అని టైప్ చేసీ ఎస్ఎంఎస్ పంపాలి.
- అంతే కాదు 39020202/ 18601801290 నంబర్లకు కాల్ చేసి మీ లావాదేవీలను ఈఎంఐలోకి మార్చుకోవచ్చు. దీనికి రూ.249 నుంచి రూ.1,500 వరకు ప్రాసెసింగ్ ఛార్జీలు పడతాయి. వడ్డీ రేటు 22 శాతంగా ఉంది.
- కనీసం మొత్తం రూ.500 ట్రాన్సాక్షన్లు చేసినా కూడా ఈఎంఐలోకి మార్చుకోవచ్చు. కానీ, ఈఎంఐ బుకింగ్ అమౌంట్ కనీసం రూ.2,500 ఉండాలి.
మీరు కూడా ఈ సౌలభ్యాన్ని పొందడానికి మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటే కొనేయండి. వాటిని తర్వాత వాటిని సులభంగా ఈఎంఐ కిందకు మార్చుకోండి. తర్వాత ప్రతి నెలా తక్కువ ఈఎంఐతో చెల్లింపులు నిర్వహిస్తే సరిపోతుంది. మీరు కొన్న ప్రొడక్ట్ అలాగే మిగిలిపోతుంది. ఈ ఆఫర్‌ను మీకు దక్కకుండా పోతుంది. అందుకే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరీ లావాదేవీలు చేయండి.