సాగర్ ఉప ఎన్నికలో పోల్‌మేనేజ్‌మెంట్‌ పై ఫోకస్ చేసిన టీఆర్ఎస్

-

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచార గడువు దగ్గర పడుతోంది. సాగర్ సంగ్రామంలో గెలుపే లక్ష్యంగా పార్టీలన్ని వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కీలకమైన పోల్ మేనేజ్‌మెంట్‌పై అధికార టిఆర్ఎస్ దృష్టి పెట్టింది. ప్రధాన ప్రత్యర్ధిగా భావిస్తున్న కాంగ్రెస్‌కు పట్టు ఉందని భావిస్తున్న ప్రాంతాల్లో పై చేయి సాధించే పనిలో పడింది. పోలింగ్ బూత్‌ల వారీగా సమాచారం సేకరిస్తోంది. తమకు అనుకూల వాతావరణం సృష్టించుకునే పనిలో పడింది టిఆర్ఎస్.


నాగార్జున సాగర్ బై ఎలక్షన్ ప్రచార గడువు దగ్గర పడుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో జోష్ మీద ఉన్న అధికార టిఆర్ఎస్..సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉన్నప్పటికి పోల్ మెన్మేంట్ సక్సెస్ ఫుల్‌గా చేస్తే గెలుపు తథ్యం అనే ధీమాతో టిఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో బాగంగా పోలింగ్ వరకు చేపట్టాల్సిన ఎత్తుగడలపై అధికార పార్టీ దృష్టి పెట్టినట్టు సమాచారం. పలువురు నేతలతో ఒక బృందం ఏర్పాటు చేసి పోల్ మేనేజ్‌మెంట్ అప్పగించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.

2014 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు 2018 అసెంబ్లీ, 2019 లోకసభ ఎన్నికల సమాచారం టిఆర్ఎస్ సేకరించినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బూత్‌ల వారీగా కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు, టిఆర్ఎస్‌కు వచ్చిన ఓట్లపై సమాచారం విశ్లేషించారని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు కొంత పైచేయి ఉన్న పోలింగ్ బూత్‌లపై టిఆర్ఎస్ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. అక్కడ టిఆర్ఎస్ పైచేయి సాధించేందుకు అవసరమైన కార్యచరణను నేతలు అమలు చేస్తున్నట్టు సమాచారం. ఇటు కాంగ్రెస్‌కు పట్టు ఉందని భావించే మండలాలపైనా టిఆర్ఎస్ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ను బలహీనపరిచే పనిలో టిఆర్ఎస్ ఉన్నట్టు సమాచారం.

ఇప్పటికే మంత్రులు,ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో మొహరించిన టీఆర్ఎస్ ప్రత్యర్ధికి ఏ చిన్నా చాన్స్ ఇవ్వకుండా వ్యూహాలకు పదును పెడుతుంది. మరో పక్క కేసీఆర్ సభతో ఎన్నికల వాతావరణాన్ని గులాబీ పార్టీకి సానుకూలంగా మార్చాలని చూస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోల్ మేనేజ్‌మెంట్ పక్కాగా అమలు చేయడంతో గెలుపొందామని భావిస్తున్న టిఆర్ఎస్ అదే తరహా వ్యూహం నాగార్జున సాగర్ ఉపఎన్నికలో అమలు చేస్తోంది. ఇలా చేస్తే సాగర్ ఉప ఎన్నికలో గెలుపు గ్యారెంటీ అని టిఆర్ఎస్ అంచనా వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news