మ్యూచువల్ ఫండ్స్: లార్జ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్ ఫండ్లు ఎక్కువ లాభదాయకంగా ఉంటాయా?

-

మ్యూచువల్ ఫండ్లలో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అనే మూడు క్యాటగిరీలు ఉంటాయి. మీరు పెట్టుబడి పెట్టే డబ్బులు ఈ మూడు భాగాల్లో ఏదో ఒక విభాగాల్లోకి వెళతాయి. ఇదే కాకుండా ఇంకా మల్టీక్యాప్ అనీ, వివిధ విభాగాలూ అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి పక్కన పెడితే, చాలా మందికి ఉన్న సందేహం ఏమిటంటే, స్మాల్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడి, లార్జ్ క్యాప్ కంటే అధిక లాభాలని ఇస్తుందా అనేది. ప్రస్తుతం దీని గురించి తెలుసుకుందాం.

ముందుగా ఈ విభాగాల మధ్య తేడా తెలుసుకుందాం.

లార్జ్ క్యాప్

స్టాక్ ఎక్చేంజిలో లిస్టు అయిన కంపెనీల విలువ 20వేల కోట్ల కంటే ఎక్కువగా ఉన్న కంపెనీలు లార్జ్ క్యాప్ కిందకి వస్తాయి. ఇలాంటి ఫండ్లలో పెట్టే పెట్టుబడి 20వేల కంటే ఎక్కువ విలువ గల కంపెనీల్లోకే వెళతాయి.

మిడ్ క్యాప్

స్టాక్ ఎక్ఛేంజిలో కంపెనీల విలువ 5వేల కోట్ల నుండి 20వేల కోట్ల మధ్య ఉన్న కంపెనీలు.

స్మాల్ క్యాప్

5వేల కోట్ల కంటే తక్కువ విలువ ఉన్న కంపెనీలు..

ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీరు ఎంచుకున్న ఫండ్ ఎలాంటిదనేదే.

ఇక మన ప్రశ్నకి వద్దాం. లార్జ్ క్యాప్ లో పెట్టుబడి కన్నా స్మాల్ క్యాప్ లో పెట్టుబడి అధిక లాభదాయకమా?

ఇక్కడ సమాధానం అవుననే చెప్పాలి. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి. లార్జ్ క్యాప్ కంపెనీలు ఆల్రెడీ బాగా అభివృద్ధి చెందిన కంపెనీలు. అవి ఇంకా అభివృద్ధి చెందడం అనేది చాలా తక్కువ. ఆల్రెడీ టాప్ లో ఉంటాయి కాబట్టి అంతకు మించి ఇంకా ఎదగడం తక్కువ. అదే స్మాల్ క్యాప్ విషయానికి వస్తే, అవి మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ గా ఎదిగే అవకాశం ఉంది. దానివల్ల అధిక లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే స్మాల్ క్యాప్ లో పెట్టుబడి పెట్టినవారు ఎక్కువరోజులు వేచి చూడాల్సి వస్తుంది. అదీగాక మార్కెట్ హెచ్చుతగ్గులు అధికంగా ఉంటాయి. కాబట్టి నష్టాలకి కూడా రెడీగా ఉండాలి. అదే లార్జ్ క్యాప్ లో నష్టాల తాకిడి అంతగా ఉండదు. లాభాలు తక్కువ వచ్చినా నష్టాలు ఉండకపోవచ్చు.

గమనిక: మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టేముందు స్కీముకి సంబంధించిన అన్ని దస్తావేజులు జాగ్రత్తగా చదవండి.

Read more RELATED
Recommended to you

Latest news