భారీగా ప్రభుత్వ డాక్టర్ల రాజీనామా… కంగారు పడుతున్న ప్రభుత్వం

-

దేశ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్నటి నుంచి భారీగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నావ్ లో రాజీనామాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవో జిల్లాలో ప్రాథమిక, సమాజ ఆరోగ్య కేంద్రాలలో పని చేస్తున్న 16 మంది సీనియర్ వైద్యులు బుధవారం సాయంత్రం రాజీనామా చేశారు.

శిక్షాత్మక ఆదేశాలు, అసభ్య ప్రవర్తన మరియు ఉన్నతాధికారుల ఒత్తిడి తో రాజీనామాలు చేసామని వెల్లడించారు. దీనితో వారిని బుజ్జగించడానికి ఏకంగా కలెక్టర్ లు రంగంలోకి దిగారు. వీరు అందరూ కూడా సీనియర్ వైద్యులు అని ఉన్నవో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశుతోష్ కుమార్‌ వెల్లడించారు. సిఎం యోగి ఆదిత్య నాథ్ ఈ ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news