తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసులు..

-

తమిళనాడులో పుదుకోట్టై సమీపంలో కంటైనర్ లారీని తెలంగాణలోని మెదక్ జిల్లా శాలిపేటకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టడంతో పదిమంది అయ్యప్ప భక్తులు  చనిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఐదుగుర్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో గాయపడినవారి పరిస్థితి  విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.  మృతులు నాగరాజు, మహేస్, కుమార్, శ్యామ్, ప్రవీణ్, సురేష్, కృష్ణ, సాయి, ఆంజనేయులుగా గుర్తించారు. శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం గురించి తెలియగానే తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ భాస్కర్ క్షతగాత్రులు చికిత్సపొందుతున్న ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితుల్ని పరామర్శించి.. మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు.

ప్రమాదంపై స్పందించిన హరీశ్ రావు…

రోడ్డు ప్రమాదంలో 11 మంది అయ్యప్ప భక్తులు మృతి చెందడంతో ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడులో జరిగిన అయ్యప్ప భక్తుల రోడ్డు ప్రమాదం తీవ్ర దురదృష్టకరమ్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాల్సిందిగా పుదుక్కొట్టై కలెక్టర్ ను ఫోన్ లో కోరామని, ప్రయాణ సమయంలో జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news