తాచుపాము డిజైన్ లెగ్గింగ్స్ వేసుకుని భ‌ర్త‌ను భ‌య‌పెట్టాల‌నుకుంది.. సీన్ రివ‌ర్స్ అయింది..!

-

అనుకుంటాం కానీ.. ఒక్కోసారి మ‌నం కామెడీకి చేసే ప‌నులే రివ‌ర్స్ అవుతాయి. మ‌న ప్రాణాల మీద‌కు తెచ్చి పెడ‌తాయి. అలాంటి సంద‌ర్భాల్లో గాయాల బారిన ప‌డే అవ‌కాశం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మ‌హిళ‌కు కూడా స‌రిగ్గా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. ఆమె త‌న భ‌ర్త‌ను ఆట ప‌ట్టించ‌డం కోసం, కామెడీకి చేసిన ప‌ని రివ‌ర్స్ అయింది. ఫ‌లితంగా ఆమె ఒక కాలు విరిగిపోయింది. మ‌రో కాలుకు తీవ్ర గాయాల‌య్యాయి. ఇంత‌కీ అస‌లు జ‌రిగిన సంఘ‌ట‌న ఏమిటంటే..

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఓ మ‌హిళ త‌న భ‌ర్త‌ను ఆట ప‌ట్టించ‌డం కోసం అచ్చం తాచుపాము రూపంలో ఉన్న లెగ్గింగ్స్‌ను కొని వేసుకుంది. అయితే భ‌ర్త ఇంటికి రాక‌ముందే ఆమె బెడ్‌రూమ్‌లో నిద్ర‌పోయింది. అనంత‌రం ఇంటికి వ‌చ్చిన ఆమె భ‌ర్త ఆమె కాళ్ల‌ను చూసి తాచు పాము అనుకున్నాడు. వెంట‌నే అత‌ను తీవ్రంగా భ‌య‌ప‌డిపోయి దుడ్డు క‌ర్ర అందుకుని కాళ్ల‌పై చిత‌క‌బాదాడు. అదే స‌మ‌యంలో అత‌ని భార్య అర‌వ‌డంతో ఆమె పామును చూసే అరుస్తుందనుకున్న ఆమె భ‌ర్త మ‌రింత గ‌ట్టిగా కాళ్ల‌పై బాదాడు.

Serious Post!Every women need to be careful when choosing and wearing stockings, even if they look like stylish.this…

Posted by Pakistani Community in Australia on Sunday, December 23, 2018

అయితే చివ‌ర‌కు అస‌లు విష‌యం తెలిసింది. త‌న‌ను ఆట ప‌ట్టించ‌డం కోసం త‌న భార్యే తాచు పాము డిజైన్ క‌లిగిన లెగ్గింగ్స్‌ను వేసుకుంద‌ని ఆ భ‌ర్త‌కు తెలియ‌డంతో అత‌ను అవాక్క‌య్యాడు. వెంట‌నే త‌న భార్య‌ను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాడు. డాక్ట‌ర్లు ఆ మ‌హిళ‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయ‌గా, ఆమె ఒక కాలు విరిగింద‌ని తెలిసింది. మ‌రో కాలుకు కూడా తీవ్ర గాయాల‌య్యాయి. అవును మరి.. మనం కామెడీ అనుకుని చేసే ఇలాంటి ప‌నులు రివ‌ర్స్ అయితే ఫ‌లితం ఇలాగే ఉంటుంది.. అప్పుడు క‌లిగే పెయిన్‌ను అనుభ‌వించ‌క త‌ప్ప‌దు క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news