ఫ్లాష్ : ఈటల రాజేందర్ రాజీనామా ఆమోదం..

-

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాకు ఆమోదం ముద్ర పడింది. కాసేపటి క్రితమే ఈటల రాజీనామాను తెలంగాణ స్పీకర్ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి ఆమోదించారు. ఎమ్మెల్యే పదవికి ఇవాళ ఉదయం 11 గంటలకు ఈటల రాజీనామా చేశారు. హుజురాబాద్ నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్.. ఇటీవలే భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు. కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ బర్తరఫ్ చేయడంతో.. టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ రాజీనామా ఆమోదంతో  హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది.

కాగా ఈటల రాజేందర్ ఎమ్మెల్యే ఇవాళ ఉదయం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ పత్రాన్ని ఆయన అసెంబ్లీ కార్యదర్శికి పంపారు. గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఆయన రాజీనామా పత్రాన్ని పంపారు. ఇక ఈటల రాజేందర్ ఈ నెల 14న బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈటల సహా ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ కూడా కాషాయం జెండా కప్పుకోనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news