సాధారణంగా పురుషులు కండోమ్ ని వాడుతారు అని మనకి తెలుసు. అయితే ఆడవాళ్ళ కూడా కండోమ్ ఉపయోగించవచ్చా..? దీనికోసం నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. మరి వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం.. ఈరోజు మనం కాంట్రాసెప్టివ్ గురించి కొన్ని విషయాలు చూద్దాం. ప్రెగ్నెన్సీ మరియు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి కాంట్రాసెప్టివ్స్ ఉపయోగపడతాయి.
అయితే ఇక్కడ ఉన్న ఈ పద్ధతులు ఏవి కూడా పర్మినెంట్ గా పని చేయవు. కేవలం టెంపరరీగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత తిరిగి ఫెర్టిలిటీ వస్తుంది.
Female Diaphragm or Cervical Cup
సర్వైకల్ కప్ సెక్స్ చేస్తున్న సమయంలో వజీనా లో ఇన్సర్ట్ చేయాలి. ఇవి కప్పు ఆకారంలో ఉంటాయి. వీటిని ఉపయోగించి సెక్స్ లో పాల్గొనడం వల్ల స్పెర్మ్ మహిళ లోపలికి వెళ్లకుండా చూస్తుంది. దీని యొక్క ఫెయిల్యూర్ రేటు వచ్చేసే 17 శాతం మాత్రమే. ఇవి మనకి ఆన్లైన్ లో దొరుకుతాయి.
ఆడవాళ్ళ కండోమ్స్:
ఈ మధ్య కాలం లో ఇది చాలా పాపులర్ అయిపోయింది. ఇది కూడా సెక్సువల్ ఇంటర్ కోర్స్ లో బాగా ఉపయోగపడుతుంది. అయితే దీనిని సెక్సువల్ ఇంటర్ కోర్స్ కి ఎనిమిది గంటల ముందు దీనిని వాజినాలో ఇన్సర్ట్ చేసుకోవాలి. దీని వల్ల మంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. 14 శాతం మాత్రమే దీని యొక్క ఫెయిల్యూర్ రేట్. ఈ కండోమ్స్ ని ఉపయోగించడం వల్ల Sexually transmitted diseases సమస్యలు రాకుండా ఉంటాయి.
కాంట్రాసెప్టివ్ స్పాంజ్:
ఇది మెత్తగా డిస్క్ షేప్ లో ఉంటుంది. ఇది అంతా కూడా spermicidal gel తో ఫిల్ అయ్యి ఉంటుంది. ఇది స్పెర్మ్స్ ని చంపేస్తుంది. సెక్సువల్ ఇంటర్ కోర్స్ కి ఆరు గంటల ముందు దీనిని ఇన్సర్ట్ చేసుకోవాలి. దీని వల్ల మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. దీని యొక్క ఫెయిల్యూర్ రేట్ 14 శాతం నుండి 27 శాతం ఉంది. అప్పుడే పిల్లలు వద్దనుకునే వాళ్ళకి ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది.