ఏపీలో భాజపాకు గట్టి ఎదురుదెబ్బ…

-

ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేశారనే నిందతో పూర్తి స్థాయిలో ప్రజలకు దూరమవుతున్న పార్టీ నుంచి రోజుకో నేత దూరం అవ్వడం చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా… రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భాజపాకు పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ వీడుతున్నారంటూ వస్తోన్న ఊహాగానాలకు నేడు చెక్ పెట్టారు. ఈ రోజు సాయంత్ర ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21న జనసేనలో చేరుతున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని, ప్రధానంగా మూడు అంశాల్లో అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. భాజపా ఏపీ పై కక్ష పూర్వకంగా వ్యవహరిస్తోందన్నారు. విశాఖ రైల్వేజోన్‌, దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీల్‌ప్లాంట్‌ మంజూరు చేయకుండా అన్యాయం చేసిందని తెలిపారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తనను పార్టీలోకి ఆహ్వానించారని, ఆయన ఏ పదవి ఇచ్చినా స్వీకరించేందుకు తాను సిద్ధమని చెప్పారు. ఇదిలా ఉంటే ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు సైతం కరువయ్యారని ఆయన పేర్కొనడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news