ఇది ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం

-

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఏది.. అని అడిగితే.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న క్రికెట్ స్టేడియం అని ఇప్పుడు చెబుతారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత మాత్రం.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న స్టేడియం అని చెప్పాలి. అవును… మెల్‌బోర్న్‌లో ఉన్న క్రికెట్ స్టేడియాన్ని తలదన్నేలా నిర్మిస్తున్నారు ఈ స్టేడియాన్ని. ప్రస్తుతం అక్కడ మొటెరా స్టేడియం ఉంది. దాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా దాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పరిమల్ నథ్వానీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్న స్టేడియం ఫోటోలను కూడా తన ట్విట్టర్ ఖాతా షేర్ చేశారు పరిమల్. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. యావత్ భారతదేశానికే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ గర్వకారణంగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news