ఆ ఇద్దరు సీనియర్లకు కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

-

దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాల్లో ఉన్న ఓ ఇద్దరు సీనియర్లు…ఇప్పుడు పదవుల కోసం చకోరా పక్షుల మాదిరిగా ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ కరుణించకపోతారా? ఎమ్మెల్సీ అయినా ఇవ్వకపోతారా? అని చూస్తున్నారు. అలా పదవుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఆ ఇద్దరు సీనియర్లు ఎవరో కాదు. గతంలో టీడీపీలో కీలక పాత్ర పోషించిన తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరిలు.

కేసీఆర్

వీరు చాలా ఏళ్ళు టీడీపీలో రాజకీయాలు చేశారు. కానీ తెలంగాణలో టీడీపీ క్లోజ్ అయిపోవడంతో టీఆర్ఎస్‌లోకి జంప్ కొట్టారు. ఇక గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. 2016 పాలేరు ఉపఎన్నికలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన తుమ్మల, ఆ తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో పనిచేశారు. కానీ 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమి పాలయ్యారు. ఇక అప్పటినుంచి కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇస్తారేమో అని తుమ్మల ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణలో పలు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కరోనా నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇక ఆ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు కేసీఆర్ ఛాన్స్ ఇస్తారని తుమ్మల వెయిట్ చేస్తున్నారు. ఇటు కడియం శ్రీహరి సైతం అదే బాటలో ఉన్నారు. గతంలో కడియం ఎమ్మెల్సీ అయ్యి, కేసీఆర్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

ఇక రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కూడా మంత్రి పదవి ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇస్తారని కడియం సైతం బాగానే వెయిట్ చేస్తున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్‌లో ఎలాంటి పదవి రాకపోతే ఈయన బీజేపీలోకి జంప్ చేసేందుకు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కీలక నేతగా ఉన్న కడియంని మంత్రి వర్గంలో తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఈ ఇద్దరు సీనియర్లకు కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇస్తారో లేదో?

Read more RELATED
Recommended to you

Latest news