ఈటల రాజేందర్ etela rajendar కు మరో షాక్ వచ్చి పడింది. ఇప్పటికే అచ్చం పేట భూముల వ్యవహారంతో సతమతమవుతున్న ఆయన దాని నుంచి బయట పడేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీలో చేరడం, దాని నుంచి ఎమ్మెల్యే టికెట్ హామీతో పాటు రాజకీయ భవిష్యత్‌పై కూడా హామీ తీసుకోవడం జరిగాయి. ఇక ఇప్పటికే హుజూరాబాద్‌లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు.
అయితే ఇంకోవైపు టీఆర్ ఎస్ కూడా ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు పన్నుతోంది. కాగా ఎలాగైనా ఈటలకు చెక్ పెట్టాలని టీఆర్ ఎస్ సర్కార్ ఎత్తుమీద ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే ఆయన్ను కోర్టుల్లో బంధీ చేసేందుకు ప్లాన్ చేయగా.. ఇప్పుడు మరో ప్లాన్ వేసింది.
రాజీనామా చేయక ముందు ఈటల రాజేందర్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీకి అధ్యక్షుడిగా కొనసాగారు. దీంతో ఈ సొసైటీని తెరమీదకు తెచ్చింది కేసీఆర్ సర్కార్. ఇందులో ఈటల హయాంలోనే కొన్ని అక్రమాలు జరిగినట్టు ఏసీబీకి ఫిర్యాదు వచ్చింది. ఇక ఏసీబీ అధికారులు ఈరోజు రంగంలోకి దిగి తనిఖీలు కూడా స్టార్ట్ చేశారు. ఈటలపైనే మెయిన్‌గా ఫిర్యాదులు వచ్చాయని వారు తెలిపారు. ఈరోజు మాత్రం సొసైటీ మెయిన్ ఆఫీసులో తనిఖీలు చేశారు. ఇక త్వరలోనే ఇందులోకి ఈటలను లాగుతారని ప్రచారం జరుగుతోంది.