ఉగ్రవాద కదలికలు : డీజీపీని కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్

-

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ని గోషామహల్ బిజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ కలిశారు. ఈ సందర్భంగా మూడు అంశాలపై డిజిపికి వినతి పత్రం అందించారు.  తనకి‌ గన్ లైసెన్స్ ఇవ్వాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదన్న రాజాసింగ్… 2014 నుంచి గన్ లైసెన్స్ కోసం పోలీసులను కోరుతున్నానని తెలిపారు. అంతేకాదు.. హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ అంశంపై డిజిపి కి వినతిపత్రం అందజేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. మల్లేపళ్లి లాంటి ప్రాంతాల్లో రెండు ఉగ్రవాదులు పట్టుబడ్డారని.. 2012 లో సైతం మల్లేపల్లి లోనే ఉగ్రవాదులను పట్టుకున్నారని.. అయినప్పటికి అక్కడ నిఘా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు మల్లేపల్లి లో ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని.. ఉగ్రవాద కదలికతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందన్నారు. అలాగే… గోవధ పై డిజిపి తో చర్చించిన రాజాసింగ్… జంతువుల అక్రమ రవాణ, గోవధను పూర్తిగా నిషేధించాలని కోరారు. గోవధ పై పలు రాష్ట్రాల చట్టాలను డిజిపి కి సమర్పించారు రాజా సింగ్. ఎంపి‌ స్థానం‌లో‌ ఉండి గోవధను ప్రోత్సహిస్తున్న అసద్ పై చర్యలు తీసుకోవాలని… రాజ్యాంగ బద్ధ స్థానం‌లో ఉండి జంతు హత్యను ఎలా ప్రోత్సహిస్తారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news