మనం తీసుకునే ఆహారంలో పండ్లు ఖచ్చితంగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. మహమ్మారి వలన రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆహారంలో పండ్లను భాగం చేసుకోవడం అలవాటు చేసుకున్నారు కూడా. ఐతే పండ్లను తినేటపుడు చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. వాటి తోలు తీసి తినాలా? లేదా తోలుతో పాటు తినాలా? ఈ విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం తోలు తీయకుండా తినడమే మంచిది.
కూరగాయలైనా, పండ్లు అయినా తోలు తీయకుండా తీస్తే అందులో ఉన్న పోషకాలు శరీరానికి అందుతాయి. తోలులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 25-30శాతం విటమిన్లు, పోషకాలు మొదలైనవన్నీ తోలులోనే ఉంటాయని నిపుణుల మాట. అందువల్ల తోలు తీయకుండా తినే పండ్లని ఎంచుకోవడం ఉత్తమం. దానివల్ల అందులోని పూర్తి పోషకాలు శరీరానికి చేరతాయి. అలాంటి వాటిల్లో ఆపిల్, పీచ్, ద్రాక్ష, జామకాయ, ఆల్బూకర్ (ప్లమ్), నారింజ ( లోపలి తెల్లని తోలు) మొదలగు బాటిని తోలు తీయకుండానే తినాలి.
తోలు తీయకుండా తినాల్సిన పండ్లని తినడం వల్ల మీ ఆకలి బాగా తగ్గుతుంది. దానివల్ల కడుపు నిండిగా ఉంటుంది. ఎక్కువ తినరు కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉండదు. అందులో ఉన్న ఫైబర్ మీ శరీరానికి మేలు చేసి, ఎక్కువ తినడాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకున్న వారు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది అని చెప్పేది అందుకే.