జపాన్: టోక్యో ఒలింపిక్స్ అర్చరీ మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ పూర్తి అయింది. భారత ఆర్చర్ దీపికా కుమారి తొమ్మిదో స్థానంలో నిలిచారు. తొలి మూడు స్థానాల్లో దక్షిణ కొరియా ఆర్చర్లు ఉన్నారు. ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఆర్చరీలో మహిళల వ్యక్తిగత క్వాలిఫికేషన్ రౌండ్ జరిగింది. ఈ మెగా ఈవెంట్‌లో దీపికా కుమారి సత్తా చాటారు.
అయితే తన ప్రత్యర్ధి ఆన్ సాన్ మాత్రం రికార్డు సృష్టించారు. ప్రపంచ నెంబర్ వన్‌గా బరిలో దిగిన దీపికా కుమారి తొలి రౌండ్‌లో 663 పాయింట్లు సాధించగా ఆన్ సాన్ 680 పాయింట్లు సాధించి ముందు వరుసలో ఉన్నారు.
కాగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. 2020లో జరగాల్సి ఈ క్రీడలు కరోనా కారణంగా తాజాగా జరుగుతున్నాయి. మొత్తం 11 వేలకు పైగా క్రీడాకారులు ఈ ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపనున్నారు. అయితే ఈసారి ఒలింపిక్స్ వేదికపై ప్రేక్షకులు కనిపించడం లేదు. కోవిడ్ నిబంధనల ప్రకారం వారిని అనుమతించలేదు.