కేంద్ర కేబినెట్ మంత్రిగా సికింద్రాబాబాద్ ఎంపీ గంగాపురం కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు, బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు కిషన్‌రెడ్డి కేంద్రంలో పెద్ద దిక్కుగా ఉంటారని భావించారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. కాగా, తాజాగా ఆయన ‘జన ఆశీర్వాద యాత్ర’ ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తన ఇమేజ్‌ను కిషన్‌రెడ్డి ఇంకా పెంచుకుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కిషన్‌రెడ్డి ఏపీ నుంచి యాత్ర షురూ చేశారు. ఇక ఆయన యాత్రకుగాను తిరుమలలో ఆ తర్వాత విజయవాడలో యాత్ర చేసేందుకు ఏపీ సర్కారు మొదట పర్మిషన్ ఇచ్చింది. అయితే తిరుమలలోనిర్వహించిన యాత్ర అనంతరం ప్రెస్‌మీట్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కావాలనే జగన్ ప్రభుత్వం కక్ష పూరిత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తాను గతంలో ఎన్నడూ ఏపీలో ఇలాంటి పరిస్థితి చూడలేదని వాపోయారు.
కాగా, కిషన్‌రెడ్డి విమర్శలతో జగన్ సర్కారు అప్రమత్తమైంది. ఇక కిషన్‌రెడ్డి కౌంటర్లను జోరుగా ప్రచారం చేయడం కూడా వైసీపీకి అస్సలు నచ్చలేదు. దీంతో అప్పటికప్పుడు వ్యూహాత్మకంగా ప్లాన్ మార్చేసింది వైసీపీ సర్కారు. కిషన్‌రెడ్డి తిరుపతి నుంచి విజయవాడకు చేరుకునే సరికి విజయవాడలో యాత్రకు అనుమతి లేదని తెలిపింది. తిరుపతి నుంచి డైరెక్టుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఆ తర్వాత విజయవాడకు రూట్ ప్లాన్ చేసుకున్నారు కేంద్రమంత్రి. కానీ విజయవాడకు వస్తున్న క్రమంలో ఎనికేపాడు వద్ద కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని ర్యాలీకి పర్మిషన్ ఉండబోదని చెప్పారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. బీజేపీ నేతలుకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దాంతో కిషన్‌రెడ్డి వెళ్లిపోయారు. అయితే, ఈ విషయాలను మనసులో పెట్టుకుని కేంద్రమంత్రి వైసీపీ ప్రభుత్వంతో భవిష్యత్తుల్లో వైరం పెట్టుకున్నే అవకాశాలుంటయాని బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.