నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల..!

-

ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఏపీలోని 13 జిల్లాల్లో 14 టెలీ మెడిసిన్ హబ్స్ నిర్వహిస్తున్నారు. వీటిలో ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక పూర్తి వివరాలలోకి వెళితే..

దీనిలో మొత్తం 70 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తుకు సెప్టెంబర్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. పోస్టుల వివరాలలోకి వెళితే.. మొత్తం 70 ఖాళీలు వున్నాయి. పీడియాట్రీషియన్‌ 14, గైనకాలజిస్ట్‌ 14, మెడికల్‌ ఆఫీసర్లు 28, జనరల్‌ ఫిజీషియన్‌ 14. పీడియాట్రీషియన్, గైనకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఎంబీబీఎస్ తో పాటు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్/డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

పీడీయాట్రీషియన్, గైనకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. లక్ష వేతనం చెల్లించనున్నారు. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు MBBS తో పాటు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 53 వేల వేతనం ఉంటుంది. మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు https://hmfw.ap.gov.in/ లో పూర్తి వివరాలు తెలుసుకొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news