కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి ఈతల రాజేందర్ కు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈటలది ముసలి కన్నీరని.. బొట్టు పిల్లలు, గడియారాలు ఇస్తే ఓట్లు రాలవని చురకలు అంటించారు హరీష్ రావు. కరోనా కష్ట కాలం లో కూడా మిమ్ములను కడుపుల పెట్టుకొని చూసుకున్నామని.. వచ్చే సంవత్సరం లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రం లో ఒక్క డబల్ బెడ్రూమ్ కట్టించని వ్యక్తి ఈటల అని.. కట్టిన రైల్వే స్టేషన్ లను అమ్మే సంస్కృతి బీజేపీ దని మండిపడ్డారు. ఎకరం అమ్ముతా ఎలక్షన్ గెలుస్తా అని ఈటల అంటున్నాడని ఫైర్ అయ్యారు. హుజురాబాద్ పట్టణానికి కోటి యాబై లక్ష ల తో సబ్ స్టేషన్ ను నిర్మిస్తామన్నారు. గెల్లు శ్రీను అంటేనే గెలుపు శ్రీను అని స్పష్టం చేశారు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన గెల్లు శ్రీను మీద 130 కేసులు పెట్టారని గుర్తు చేశారు. హుజూరాబాద్ ప్రజలు గెల్లు శ్రీనుకు ఓటేయాలని కోరారు హరీష్ రావు.