మొదటి నుంచి కేటీఆర్ ఒక విషయానికి దూరంగా ఉంటున్నారు. ఆ విషయంలో వాళ్ల నాన్న కేసీఆర్, ఆయన కొడుకు హిమాన్షు మాత్రం ముందున్నారు. ఆ విషయమేమిటంటే పూజలు, యజ్ఞాలు. వీటికి కేటీఆర్ ఎప్పటినుంచో దూరంగా ఉంటున్నాడు. అయితే హోమాలు, యజ్ఞాల విషయంలో కేసీఆర్ ఎంతో భక్తి భావంతో ఉంటాడు. కేసీఆర్ మొదటి నుంచి భక్తి వంటి కార్యక్రమాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. అయితే మరో విషయమేమిటంటే కేటీఆర్ కొడుకు హిమాన్షు కూడా దేవుళ్లపై విపరీతమైన భక్తిని చూపుతాడు.
కేసీఆర్ ఎప్పుడు యాగాలు, హోమాలు చేసినా కేటీఆర్ మాత్రం దూరంగా ఉంటాడు. అచ్చం తాత లాగా హిమాన్షు మాత్రం హోమాలు, యాగాలపై చాలా నమ్మకంతో ఉంటాడు. అయితే కేసీఆర్‌ను హిమాన్షు ఫాలో అవుతున్నట్టు ఉన్నాడు. కేసీఆర్ ఎక్కడ పూజలు చేసినా హిమాన్షు అక్కడ ప్రత్యక్షమవుతుంటాడు. కేసీఆర్ వెంటే హిమాన్షు ఉంటాడు. ఇక ప్రతీ వినాయక చవితికి కేసీఆర్, హిమాన్షు వెళ్లి ఖైరతాబాద్ గణేషుడి దర్శనం చేసుకుంటారు. హిమాన్షు చాలా చిన్నోడే అయినా దేవుడంటే చాలా భక్తి.
అయితే ప్రస్తుతం కేటీఆర్ కూడా తన రూటును మార్చినట్టు ఉన్నాడు. తను కూడా వారి రూట్లోనే వెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఇందకు నిదర్శనం ఢిల్లీలో నిర్మిస్తున్నన తమ పార్టీ భవన శంకుస్థాపనే. కేటీఆర్ భూ వరాహస్వామి యజ్ఞంలో పాల్గొనడంతో సంచలనంగా మారింది. ఎప్పుడూ పాల్గొనని కేటీఆర్ ఈ హోమంలో పాల్గొనటంతో అందరూ ఆశ్ఛర్యపోయారు. కేసీఆర్ రావడం ఆలస్యం కావడంతో ఆయనే ఈ హోమంలో పాల్గొన్నాడు. అయితే కేటీఆర్ పూజల విషయంలో నమ్మకం వచ్చిందని అనుకుంటున్నారు. ఇక ముందు కూడా పూజలు చేస్తాడో, లేక ఎప్పటిలాగే ఉంటాడో చూడలి.