దేశంలో కరోనా కేసుల పెరుగుదల పెద్దగా లేదని, ప్రస్తుతానికి కరోనా వైరస్ విజృంభణ బాగా తగ్గిందని, కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకీ తగ్గుతుందని అందువల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలియదని, కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఎలా జరిగిందో ఇంకా మర్చిపోలేదని, అందువల్ల రాబోయే రెండు మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
వచ్చే రెండు మూడు నెలల్లో కరోనా కేసులు పెరగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని, తద్వారా భారతదేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టాలని సూచించింది. భౌతికదూరం, పరిశుభ్రత, మాస్ ధరించడం సహా అన్ని జాగ్రత్తలు పాటించాలని, పండగల సమయంలో గుంపులు గుంపులుగా తిరగడాలు, మొదలగు వాటివల్ల కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్నందున ఈ రెండు మూడు నెలల పాటు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం సూచించింది.