తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఐటీ మంత్రి కేటీఆర్ మరోసారి రెచ్చిపోయాడు. రేవంత్ రెడ్డి ఓ థర్డ్ రేట్ క్రిమినల్ అని మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌కు ఓ దొంగ నాయకత్వం వహిస్తున్నాడనీ, టీపీసీసీ ‘చీప్ ‘ రేవంత్ అని విమర్శించారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదా ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ని రేవంత్‌రెడ్డి గాడిద అంటూ సంబోధించడం సరికాదనీ, ఓ థర్డ్ రేటెడ్ క్రిమినల్ కి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే ఇలాగే ఉంటుందని మంత్రి కేటీఆర్ గురువారం ఓ ఆంగ్లపత్రిక కథనాన్ని జతచేస్తూ ట్వీట్ చేశారు.
రేవంత్‌రెడ్డి లాంటి నీచమైన వ్యక్తులు స్పందించరేమో కానీ, రాజకీయాల్లో ఉన్న చెత్తను అందరి ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఫరెన్సిక్ పరీక్షకు పంపితే ఓటుకు నోటు కేసులో దొరికిన ఆడియోతో ఇది సరిపోతుందన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ ఏమైనా స్పందిస్తారా’అని ట్వీట్‌లో కేటీఆర్ ప్రశ్నించారు.
కాగా, కేటీఆర్‌కు బదులిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ‘కేటీఆర్ పెద్ద అబద్ధాలకోరు’అని ట్వీట్ చేశారు. చిన్నారి హత్యాకాండలాంటి ఘటనల నుంచి కేటీఆర్ ప్రజలను తప్పు దోవ పట్టించేయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
మరోవైపు శశిధరూర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో అలజడి సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలు సరికాదనీ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పార్టీ సినీయర్ నేతలను నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత పైన నోరు పారేసుకోవడం పై కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారి రేవంత్ రెడ్డికి గట్టిగానే బుద్ధి చెప్పారు.
రేవంత్ వ్యాఖ్యలపై శశిధరూర్ సైతం తనదైన శైలిలో స్పందించారు. రేవంత్ రెడ్డి ఆయన మూలాలను గుర్తుంచుకొనే గాడిద అనే మాట మాట్లాడారేమో అని అన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి శశిథరూర్‌కు ఫోన్‌చేసి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానంటూ క్షమాపణ కోరారనీ సమాచారం. ఈ విషయాని శశిథరూర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. కాంగ్రెస్ బలోపేతానికి కలిసి పనిచేద్దామని థరూర్ అన్నారు.