తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన “వైట్ ఛాలెంజ్” ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచిందనే చెప్పాలి. టాలీవుడ్ లో హడావిడి చేసిన డ్రస్ వ్యవహారం అనంతరం ఈ ఛాలెంజ్ వెలుగులోకి వచ్చింది! అయితే… ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో కేటీఆర్ కు పరోక్షంగా సంబంధం ఉందనే కామెంట్లు చేశారు రేవంత్ రెడ్డి! దీంతో… రేవంత్ ఫస్ట్ వైట్ ఛాలెంజ్ కేటీఆర్ కే విసిరారు!
దీంతో… రేవంత్ విసిరిన ఛాలెంజ్ కు కేటీఆర్ స్పందించారు. అయితే ఈ స్పందించిన విధానం మీద సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్లు పడుతుండటం ప్రస్తుతం మరో హాట్ టాపిక్. ఛాలెంజ్ అంటే ఛాలెంజే కానీ.. మళ్లీ “కండిషన్స్ అప్లై” అంటూ కేటీఆర్ స్పందించడం సరైంది కాదని నెటిజన్ల నుంచి స్పందన వస్తుంది!
అవును… రేవంత్ రెడ్డి విసిరిన “వైట్ ఛాలెంజ్” పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. “నేను ఏ పరీక్షకు సిద్ధంగా ఉన్నాను.. రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ పరీక్షలు చేపించుకోవడానికి సిద్ధామా?.. ఇందుకోసం ఢిల్లీ ఎయిమ్స్ లో టెస్ట్స్ చేయించుకునేందుకు తాను సిద్ధం.. ఒక వేళ తాను టెస్టులు చేయించుకుని, క్లీన్ చీట్ తో బయటకు వస్తే.. రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పి, పదవులు వదులుకుంటారా?” అనేది కేటీఆర్ ప్రతిస్పందన!
రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసరడం ఏమిటి?.. అందుకు కేటీఆర్… రాహుల్ ని మధ్యలోకి తీసుకురావడం ఏమిటి?
తాను టెస్ట్ చేయించుకునేది – లేనిదీ.. చెప్పాలి కానీ… మధ్యలో రాహుల్ ప్రస్థావన ఎందుకు?
ఫలితంగా… రేవంత్ “వైట్” గానే ఉన్నారని చెప్పడం కేటీఆర్ ఉద్దేశ్యమా? లేక, తన స్థాయి రాహుల్ రేంజ్ అని చెప్పే ప్రయత్నమా?
కేటీఆర్ “వైట్” గా ఉంటే… రేవంత్ పదవులు వదులుకోవడం ఎందుకు?
రాహుల్ “వైట్” గా ఉంటే.. కేటీఆర్ రాజకీయాలనుంచి తప్పుకుంటారా?
చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి తనది కాదని మంత్రి కేటీఆర్ చెప్పడం పలాయనవాదం కాదా?
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ పై నెటిజన్లు సందిస్తున్న ప్రశ్నలు ఇవి.
మరి ఈప్రశ్నలపై కేటీఆర్ స్పందిస్తారా లేక.. ఈ వైట్ ఛాలెంజ్ ని కూడా రాజకీయాలతో పూర్తిగా కలిపేసి, రాజకీయ విమర్శలు చేసేసుకుని, సైడ్ చేసేస్తారా అన్నది వేచి చూడాలి! ఏది ఏమైనా… “ప్రతిపక్ష నాయకుడు ఇచ్చిన సవాల్ ను ధైర్యంగా స్వీకరించడం, హుందాగా నిలబడటం మానేసి.. స్థాయిల గురించి మాట్లాడటం.. కేటీఆర్ పతనానికి ఆరంభం” అనే కామెంట్లు రాజకీయవర్గాల్లో వినిపించడం కొసమెరుపు!
కాగా… రేవంత్ రెడ్డి విసిరిన “వైట్ ఛాలెంజ్” ను స్వీకరించి గన్ పార్క్ కు చేరుకున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి… రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ ఆదర్శం గా ఉందని, కేటీఆర్ కూడా ముందుకు వస్తే అయన స్థాయి పెరిగేదని వెల్లడించారు. అనంతరం బండి సంజయ్, ఆరెస్ ప్రవీణ్ కు ఆయన “వైట్ ఛాలెంజ్” విసిరారు!
– CH Raja