Bigg Boss 5: బిగ్ బాస్ .. తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో. తెలుగు ప్రేక్షకుల అలరిస్తూ.. బుల్లితెరపై అంచనాలను మించి దూసుకపోతుంది. ఈ షోలో బిగ్ బాస్ గొడవలు క్రియేట్ చేసి హీట్ పుట్టించినా.. అప్పుడప్పుడూ కామెడీ టాస్కులతో నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. కానీ నిన్న ప్రసారమైన షోలో.. ఏదో ఎమోషన్ క్యారీ అయింది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు ఉంటాయి. అవి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి.
అలాగే.. హౌస్‌లోని కంటెస్టెంట్ల జీవితంలోని కష్టాసుఖాలను తెలుసుకోనే ప్రయత్నం చేశారు. వారి వారి జీవితాల్లోని మరుపురాని తొలి ప్రేమ లను చెప్పాలనే టాస్క్ ఇచ్చాడు. మీ తొలి ప్రేమ పేరు రాసి ఎందుకు ప్రత్యేకమైందో చెప్పాలని ఆదేశించాడు. ఈ టాస్క్‌తో కంటెస్టెంట్లందరూ.. తమ గతంలోకి వెళ్లారు.
ఈ టాస్క్‌ను తొలుత శ్రీరామ చంద్రతో ప్రారంభించారు. తన లవ్‌కి పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పి నవ్వించాడు. కండాల వీరుడు విశ్వ.. వరుసకాని అమ్మాయికి సైట్ వేసి.. లవ్ లో ఫేయిల్ అయినట్టు చెప్పుకొచ్చాడు. కానీ, తాను ఈ స్టేజీ ఉన్నంటే.. తన తల్లి, భార్యనే కారణమని, వారికి జీవితంతం ఉంటానని భావోద్వేగానికి గురయ్యాడు. బేబీ అనేది.. హా ఏంటి చెప్పు అని అనేవాడినంటూ నటరాజ్ మాస్టర్ తన తొలిప్రేమను బయట పెట్టాడు.
ఇక మోడల్ జేస్సీ.. తన ఫస్ట్ లవ్ దీప్ గురించి చెప్పడమే కాదు.. తాను ఇంకా సింగిల్ అయితే.. రెడీ టు మింగిల్ అవ్వడానికి రెడీ అంటూ ప్రపోజ్ చేశాడు. షణ్ముఖ్ తన లవ్‌స్టోరీ రివీల్ చేస్తూ.. 8వ తరగతి నుంచి ఓ అమ్మాయిని చాలా ఇష్టమని, ఇంటర్ సెకండియర్‌లో ఆమె బర్త్‌డే రోజున తన లవ్ ను ప్రపోజ్ చేసినట్టు చేప్పాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమలో ఫెయిలయ్యాను. ఆ సమయంలోనే పట్టుదలతో నటన, డ్యాన్స్ నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. తనే ఎప్పటికీ నా ఫస్ట్ లవ్ వని, ఆ విషయం..దీపుకు కూడా తెలుసు.. అంటూ షన్ను లవ్ సోర్టీని చేప్పేశాడు.
యాంకర్ రవి తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ.. సాయిబాబా గుడిలో ఓ ఆమెను చూశానని, ఆమె ఏ కాలేజో తెలుసుకోని ఆమె కాలేజీలో జాయిన్ అయ్యానని చెప్పాడు. తన ఫ్రెండ్ ఆ అమ్మాయికి లైన్ వేస్తుంటే.. వాడిని మెల్లిగా సైడ్ చేసి.. తాను లైన్ చేసినని చెప్పాడు. చదువే అని, చదువు లేకపోతే.. భవిష్యత్తు లేదనే భ్రమలో ఉన్నతనకు.. జీవితమంటే ఏంటో చెప్పిందనీ, ఏదైనా సాధించ గలననే ధైర్యాన్ని తనలో నింపిందని చెప్పాడు. అలా నాలుగేళ్లు సంతోషంగా గడిపిన తరువాత పెళ్లి చేసుకున్నానని తన భార్య పేరు నిత్య అని, తనను ముద్దుగా లడ్డూ అని పిలుచుకుంటానని సంతోషంగా బెలూన్ని గాలిలోకి పంపాడు.
తర్వాత ప్రియ తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ.. తనని ముద్దుగా కేక్ అని పిలుస్తా.. తొలి సారి ఆయనను ఓ స్టూడియోలో చూశాను. నన్ను ఇష్టపడి మా ఇంటికొచ్చి పెళ్లి చేసుకుంటానని మా తల్లి దండ్రులను అడిగాడు. కానీ, అప్పుడు నా వయస్సు చిన్న.. అలాగే.. మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు.
ఆ సమయంలో మా ఇంటి బాధ్యతను తీసుకోవాలని నిర్ణయించుకున్నా, ఇప్పుడే పెళ్లి వద్దన్నాను.
అయితే.. మా అత్తవాళ్లు ఒప్పుకోలేదు, కానీ పేరెంట్స్ ఒప్పుకుని పెళ్లి చేశారు. అతడే నా ఫస్ట్ లవ్, ఇప్పటికీ ప్రేమిస్తున్నా. కానీ ఆత్మగౌరవం కోల్పోతే చోట ప్రేమ, ఇష్టానికి విలువ ఉండని తెలుసుకున్నా.. ఇప్పుడు నేను మ్యారీడా? డివోర్స్డా? సెపరేటా? అన్నది నాకే తెలియని పరిస్థితి. మాకో బుజ్జి బాబు సోనూ ఉన్నాడు’ అంటూ భావోద్వేగానికి గురైంది. కంటెస్టెంట్లందరిని కంట నీరుపెట్టించింది.