హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ నామినేషన్

-

హుజూరాబాద్ బైపోల్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. దీంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. తోలి రోజు ప్రధాన పార్టీల్లో టీఆర్ఎస్ నుంచి నామినేషన్ దాఖలైంది. టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయమే కేసీఆర్ నుంచి బీ ఫామ్ అందుకున్నారు గెల్లు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ. 28 లక్షల చెక్కును సీఎం కేసీఆర్ గెల్లు శ్రీనివాస్కు అందించారు. నామినేషన్ కు ముందు ఇల్లంతకుంటలోని ఆలయంలోొ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఎన్నికల అధికారికి నామినేషన్ ఇచ్చారు. కోవిడ్ నిభంధనల ప్రకారం ర్యాలీలు, గుంపులు గుంపులుగా ప్రజలు వచ్చే అవకాశం లేకపోవడంతో సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించే పనిలో ఉంది. NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ పేరును దాదాపుగా ఖరారు చేసింది. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పేరు దాదాపు ఖరారు అయిందనే వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news