భారత్ పై పాకిస్థాన్ గెలుపుతో ప్యాన్స్ నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా భారత పేసర్ షమీపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ప్రతిఘటన ఎదురవుతోంది. పాకిస్థాన్ మ్యాచ్లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ సరిగా బౌలింగ్ చేయలేదు. అత్యధికంగా పరుగులు ఇచ్చారు. షమీ 3.5 ఓవర్లలో 11.20 ఎకానమీ రేటుతో 43 పరుగులు ఇచ్చాడు. దీంతో క్రికెట్ ప్యాన్స్ షమీని దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో షమీకి పలువురు మాజీలు మద్దతుగా నిలిచారు. టెండూల్కర్, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్ నుంచి మద్దతు లభించింది. చివరకు బీసీసీఐ కూడా మహ్మద్ షమీకి అండగా నిలబడింది. తాజాగా మహ్మద్ షమీకి పాక్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ నుంచి అనూహ్య మద్దతు లభించింది. షమీ ఒక స్టార్ అని, ప్రపంచ క్రికెట్ లో అత్యత్తమ బౌలర్ అని రిజ్వాన్ పేర్కొన్నారు. దేశం కోసం ఆడే ఆటగాడు ఎంతో ఒత్తడిని, పోరాటాలు, త్యాగాలను ఎదుర్కొంటారని అవి అత్యత్తమమైనవని తెలిపాడు. షమీ ఒక స్టార్, మీ స్టార్లను గౌరవించండి. గేమ్ ప్రజలను ఒక చోటకు చేర్చాలి, కానీ విభజించవద్దని సూచిస్తూ ట్విట్ చేశారు.