12,978 గ్రామ పంచాయతీల్లో డిజిటల్ లైబ్రరీ లు : సీఎం జగన్

-

వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీల పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాల ప్రగతి పై సీఎం జగన్ కు వివరాలందించారు అధికారులు. రాష్ట్రంలో 12,979 పంచాయతీల్లో వైఎస్‌ఆర్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలు నిర్మాణం చేపట్టాలని సిఎం జగన్ పేర్కొన్నారు. మూడు దశల్లో విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం చేయాలని.. తొలి విడతలో4530 విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం చేపట్టాలని ఆదేహించారు.

ప్రతి విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీకి అంతరాయం లేని బ్యాండ్‌ విడ్త్‌తో ఇంటర్నెట్‌ ఇవ్వాలని.. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌లో భాగంగా గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలని.. పోటీ పరీక్షకు సన్నద్ధమవుతున్న యువతకు ఉపయోగపడాలని వెల్లడించారు.

విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలను సక్రమంగా నిర్వహించాలన్న సీఎం జగన్.. వీటి నిర్వహణపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి డిజిటల్‌ లైబ్రరీలో డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, సిస్టం ఛైర్లు, ప్లాస్టిక్‌ ఛైర్లు, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ఐరన్‌ రాక్స్, పుస్తకాలు, మేగజైన్‌ల ఏర్పాటు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఉగాదినాటికి ఫేజ్‌ 1లో కంప్యూటర్‌ పరికరాలతో సహా మొదటి దశ డిజిటల్‌ లైబ్రరీలు అందుబాటులోకి రావాలన్నారు. డిసెంబరు 2022 నాటికి ఫేజ్‌ 2 , జూన్‌ 2023 నాటికి మూడో దశ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news