Niharika Konidela: ‘ఓసీఎఫ్ఎస్’ అనే హ్యాష్ ట్యాగ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ హ్యాష్ ట్యాగ్ ను పోస్టు చేసింది మెగా డాటర్ నిహారిక. దీంతో అసలు ‘ఓసీఎఫ్ఎస్’ అంటే ఏమై ఉంటుందబ్బా అని అంతా ఆలోచనలో పడ్డారు నెట్టిజన్లు. దానికి అర్థమేమిటని ఆసక్తిగా ప్రశ్నల వర్షం కురిపించారు.
తన తండ్రి నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా దానికి అర్థమేమిటో తెలిపింది. ఓసీఎఫ్ఎస్ అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని నిహారిక చెప్పింది. ఓటీటీ వేదికగా నిహారిక తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను ఇన్‌స్టా్గ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
వివాహానంతరం.. వెండి తెరకు దూరమైనా నిహారిక ఇప్పుడు ఓటీటీ వేదికగా నిర్మాతగా మారడానికి సిద్దమయ్యిందట. ‘ఓసీఎఫ్ఎస్’ అనే వెబ్ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరించనున్నారు. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లు కాగా, టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషిస్తున్నారు. తన తండ్రి నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా నేడు ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు.
ఈ వెబ్ సిరీస్‌లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి. జీ5 ఓటీటీ వేదిక నుంచి ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ ప్రీమియర్స్ నవంబరు 19న ఉండనున్నది తెలిపింది. ఈ సందర్భంగా భర్త చైతన్య, అన్న వరుణ్‌తేజ్‌తో పాటు తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసిన నిహారిక.. ‘కుటుంబ’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.