హుజూరాబాద్ పోల్: ఆగని ‘కారు’ ప్రలోభాలు…సైలెంట్‌గా ఓటర్లు..

-

యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ మొదలైంది. ఇప్పటివరకు హుజూరాబాద్‌లో అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి…అయితే పోలింగ్ సమయంలో కూడా ఊహించని ట్విస్ట్‌లు వస్తున్నాయి. మొదట్లోనే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి…అయితే నిదానంగా అవి సెట్ అవుతూ వచ్చాయి. ఇక ఉదయం నుంచి ఓటర్లు ఓటు వేయడానికి పోటు ఎత్తారు.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

అటు ప్రధాన పార్టీల అభ్యర్ధులు పోలింగ్ బూతులు తిరుగుతూ, ఎన్నికల సరళిని గమనిస్తున్నారు. అయితే గత ఐదు నెలలుగా హుజూరాబాద్ ప్రజలని ఈటలకు దూరం చేసి, తమకు దగ్గర చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల ప్రచారం అయ్యాక కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి చేశారో చెప్పాల్సిన పని లేదు. అయితే పోలింగ్ సమయంలో కూడా మనోళ్ళు వెనక్కి తగ్గడం లేదు.

ఓటర్లని తమ వైపుకు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఒక వూరిలో హడావిడి చేస్తున్న టీఆర్ఎస్ నేతని, అక్కడి గ్రామ ప్రజలు వెనక్కి పంపించేశారు. అటు కొందరు పోలింగ్ సిబ్బందిని, ఏజెంట్లని సైతం గులాబీ నేతలు మేనేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ బూత్, మండల స్థాయి నాయకులకు సైతం పెద్ద ఎత్తున డబ్బులు ఎర చూపుతున్నారని తెలుస్తోంది. అటు పోలీసులు సైతం అధికార పార్టీకి అండగా ఉంటున్నారని ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆయన టీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలని ప్రశ్నించారు.

అయితే ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేసిన సరే హుజూరాబాద్ ప్రజలు చాలా సైలెంట్‌గా ఓటు వేసేస్తున్నారు. ఇక ఊహించని విధంగా హుజూరాబాద్‌లో ఓటింగ్ శాతం పెరిగేలా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సైలెంట్‌గా ఓటు వేస్తున్న హుజూరాబాద్ ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారో నవంబర్ 2న తేలిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news