క్యాసినోలో గెలిచిన డబ్బు కోసం దారుణం.. భారత సంతతి ఫార్మా సీఈఓ దారుణ హత్య

-

క్యాసినోలో డబ్బు గెలుచుకోవడమే పాపమైంది. తన హత్యకు కారణమైంది. దాదాపు 80 కిలోమీటర్లు వెంబడించిన దుండగుడు డబ్బుల కోసం కాల్చి చంపాడు. అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే భారత సంతతికి చెందిన తెలుగు వ్యక్తి శ్రీరంగ అర్వపల్లి(54) వ్యక్తి న్యూజెర్సీ ప్లెయిర్ బోరోలో నివాసం ఉంటున్నారు. 2014 నుంచి అరెక్స్‌ ల్యాబోరేటరీస్‌ ఫార్మా సంస్థ సీఈఓగా పని చేస్తున్నారు. క్యాసినోలో గెలిచన డబ్బును దోచుకునేందుకు దారుణంగా హత్య చేశాడు. క్యాసినో అడిన ప్రాంత నుంచి వెంబడించి డబ్బును దోచుకునేందుకు వెంబడించాడు. పెన్సిల్వేనియా నుంచి న్యూజెర్సీ దాకా వెంబడించిన దుండగుడు గన్ తో కాల్చి హత్య చేశాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని పెన్సిల్వేనియాలోని నారిస్‌టౌన్‌కు చెందిన జెకై రీడ్‌ జాన్‌(27)గా గుర్తించారు.

మంగళవారం పెన్సిల్వేనియాలో ఓ క్యాసినోలో శ్రీరంగ 10 వేల డాలర్లను గెలుచుకున్నాడు. ఇది గమనించిన జెకై రీడ్‌ జాన్‌ శ్రీరంగను ఇంటి దాాకా వెంబడించాడు. డబ్బుల కోసం నిందితుడు డిమాండ్ చేయగా ఇవ్వడానికి శ్రీరంగ నిరాకరించడంతో గన్ తో కిరాతకంగా కాల్చి చంపినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన శ్రీరంగ అక్కడిక్కడే మరణించాడు. మరణించిన శ్రీరంగకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news