దేశవ్యాప్తంగా జరుతున్న ఉప ఎన్నికల కౌంటింగ్ లో ప్రజలు వినూత్న తీర్పు నిస్తున్నారు. ముఖ్యంగా ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీకలకు ఆధిక్యత కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్, అస్సాంలో, కర్ణాటకలో ఆపార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. మరో వైపు బెంగాల్లో త్రుణమూల్ కాంగ్రెస్ భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం దేవవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 29 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. మరోవైపు దాద్రానగర్ హావేలీ లోక్ సభ స్థానంలో శివసేన ఆధిక్యంలో ఉంది. కర్ణాటక సింగ్ ఘీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, హంగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలు లీడ్ లో ఉన్నాయి. బెంగాల్ లో 4 అసెంబ్లీ స్థానాల్లో భారీ విజయం దిశగా టీఎంసీ దూసుకెళ్తుంది. అస్సాంలో 5 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 3 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.