ఈటలని నిలబెట్టిన ‘బ్యాక్ బోన్’..అంతా ఆ ‘ఒక్కడే’…

-

హుజూరాబాద్‌లో ఈటల గెలిచేశారు…జనం దగ్గరుండి గెలిపించేశారు. అధికార పార్టీ ఎన్ని రకాలుగా ప్రయత్నించిన హుజూరాబాద్ ప్రజలు లొంగలేదు…తమకు 20 ఏళ్లుగా అండగా ఉంటూ వస్తున్న ఈటల రాజేందర్‌కే అండగా ఉంటామని తేల్చేశారు. అయితే ఈ విజయం అహంకారంపై ఆత్మగౌరవం సాధించిన విజయమని హుజూరాబాద్ ప్రజానీకం భావిస్తుంది. ఇక ఈ విజయం పూర్తిగా ఈటలదే. ఈటల వల్లే ఈ విజయం సాధ్యమైందనే చెప్పాలి. ఈటలని చూసే ప్రజలు ఓట్లు వేశారు…ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

etela
etela

అయితే ఇక్కడ ఈటలని దెబ్బకొట్టడానికి అధికార టీఆర్ఎస్ అడుగడుగున ప్రయత్నించింది…మరి అలాంటి సమయంలో ఈటల వెనుక ఉండి కొంతమంది నాయకులు పనిచేశారు. ఎలాగో బీజేపీ నేతల సపోర్ట్ ఈటలకు ఉంది…వారు ప్రచారం కూడా బాగానే చేశారు. కానీ బీజేపీ నేతల్లో ఒక్కరు మాత్రం ఈటలకు బ్యాక్ బోన్‌గా నిలబడ్డారు. జితేందర్ రెడ్డి లాంటి నాయకులు ఎల్లప్పుడు ఈటలకు అండగానే నిలబడ్డారు గానీ, అన్నీ రకాలుగా అండ ఇచ్చింది మాత్రం…ఒక్క వివేక్ వెంకటస్వామి మాత్రమే.

టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన దగ్గర నుంచి… ఈటల వెనుక నిలబడింది వివేక్ మాత్రమే. ఏ క్షణంలో కూడా ఆయన, ఈటలని వదల్లేదు. టీఆర్ఎస్ ఎన్ని రకాలుగా టార్గెట్ చేసిన ఈటల తట్టుకుని నిలబడ్డారు అంటే..దానికి ప్రధాన కారణం వివేక్ అని చెప్పాలి.

ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్నీ రకాలుగా అండగా నిలబడ్డారు. అలాగే బలమైన మీడియా కూడా ఉండటంతో టీఆర్ఎస్ అనుకూల మీడియాకు చెక్ పెట్టగలిగారు. ఆర్ధికంగా ఎలాంటి సపోర్ట్ ఇచ్చారనేది చెప్పాల్సిన పని లేదు. దళిత బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చి దళిత ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేసిన టీఆర్ఎస్‌కు…దళిత నాయకుడైన వివేక్ ఎలా చెక్ పెట్టగలిగారో కూడా తెలిసిందే. ఇలా ప్రతి విషయంలోనూ ఈటలకు బ్యాక్ బోన్‌గా ఉంటూ, హుజూరాబాద్‌లో ఈటల గెలిచి నిలబడటానికి కారణమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news