స్ట్రాబెర్రీలు, పుచ్చకాయలు.. వేసవిలో మన శరీరానికి చలువ చేస్తాయి. అంతేకాదు, ఈ రెండు పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఈ రెండింటితో స్మూతీ తయారు చేసుకుని మండే ఎండల్లో సేవిస్తే.. శరీరానికి కొత్త శక్తి, ఉత్సాహం, ఉత్తేజం వస్తాయి. శరీరం చల్లగా కూడా ఉంటుంది. మరింకెందుకాలస్యం… వాటర్‌మిలన్, స్ట్రాబెర్రీ స్మూతీని తయారు చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!
వాటర్‌మిలన్, స్ట్రాబెర్రీ స్మూతీ తయారీకి కావల్సిన పదార్థాలు:
స్ట్రాబెర్రీలు – 100 గ్రాములు
తేనె – 1 టేబుల్ స్పూన్
పెరుగు – 150 గ్రాములు
పుచ్చకాయ ముక్కలు – 50 గ్రాములు
చియా సీడ్స్ (టాపింగ్ కోసం) – 1/4 కప్పు
వాటర్‌మిలన్, స్ట్రాబెర్రీ స్మూతీ తయారు చేసే విధానం:
పైన చెప్పిన అన్ని పదార్థాలను కలిపి బ్లెండర్‌లో వేసి మిశ్రమంగా పట్టుకోవాలి. స్మూతీ తయారవుతుంది. దాన్ని ఒక గ్లాస్‌లో పోయాలి. అనంతరం పైన చియా సీడ్స్ ను టాపింగ్ వేయాలి. తాగేటప్పుడు చియా సీడ్స్‌ను కలుపుకుని తాగాలి.