యూపీలో జికా వైరస్ కలకలం… 100 దాటిన బాధితుల సంఖ్య

-

ఉత్తర్ ప్రదేశ్లో జికా కలకలం రేపుతోంది. రోజు రోజుకు వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న జికా వైరస్ కేసుల సంఖ్య ఆందోళనకర పరిస్థితిని కలిగిస్తుంది. ముఖ్యంగా పారిశ్రామిక పట్టణం అయిన కాన్పూర్ లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రధానంగా జికా వైరస్ గర్భిణి స్త్రీలపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు ఉత్తర్ ప్రదేశ్ లో 106 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒకే రోజు 16 మందికి జికా వైరస్ సోకింది. దీంతో ఉత్తర్ ప్రదేశ్ సర్కారు పెరుగుతున్న కేసులతో అప్రమత్తం అయింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి రక్షణ చర్యల గురించి దిశానిర్థేశం చేశారు.

వైరస్ సోకిన వారిని ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధి కావడంతో కాన్పూర్ నగరంలో పారిశుద్ద్య పనులు వేగవంతం చేశారు. జికా వైరస్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి  15 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సుమారు వంద మంది దోమల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news