హైకోర్టులో పోసాని పిటిషన్ : జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ !

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి సంస్థల ఎన్నికలు అలాగే నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే చంద్రబాబు ఇలాక అయిన.. కుప్పం నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కార్ కు ఊహించని షాక్ తగిలింది. కుప్పం నగర పంచాయితీ ఎన్నికల్లో ప్రచారం పై స్థానిక డీఎస్పీ విధించిన ఆంక్షలను తప్పు పట్టింది ఏపీ హై కోర్టు.

తన అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించకూడదని డీఎస్పీ ఇచ్చిన సర్కులరును కొట్టేసింది ఏపీ హైకోర్టు. డీఎస్పీ సర్క్యలర్‌ , ఆంక్షలపై హైకోర్టులో ఇటీవలే లంచ్‌ మోషన్‌ పిటీషన్‌ దాఖలు అయింది. ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులను కాల రాస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ పోసాని. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన హై కోర్టు.. పులివర్తి నాని, నిమ్మల రామానాయుడు, మునిరత్నం, అమర్నాధ్ రెడ్డి ప్రచారానికి ఆటంకాలు కల్పించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రచారం చేసుకోవడం వారి హక్కని ఏపీ హై కోర్టు స్పష్టం చేసింది. దీంతో వైసీపీ సర్కార్ కు షాక్ తగిలింది.

Read more RELATED
Recommended to you

Latest news