రైతుల సత్యాగ్రహంలో కేంద్రం దిగివచ్చింది.- రాహుల్ గాంధీ.

-

కేంద్రం తీసుకువచ్చిన మూడు రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. చాలా కాలంగా ఢిల్లీలో ధర్నాలు, నిరసను కార్యక్రమాలు చేస్తున్న రైతులకు తీపి కబురు చెప్పారు ప్రధాని. అయితే దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రైతుల సత్యాగ్రహానికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదని ట్విట్టర్ లో తెలిపారు. రైతుల ఆందోళనతో కేంద్రం తన ఈగోను పక్కనబెట్టి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. జై హింద్.. జై కిసాన్ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.rahul gandhi

ఈరోజు ఉదయం దేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన ప్రధాని మోదీ.. మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు… ఈశీతాకాల సమావేశాల్లో బిల్లులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్నాళ్లు రైతులను బాధపెట్టినందుకు క్షమించాల్సిందిగా కోరారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికే బిల్లులు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అయితే చట్టాలకు మద్దతుగా రైతులను ఒప్పించడంలో విఫలమయ్యామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news