తెలంగాణ రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లో డబ్బులు

-

తెలంగాణ రైతులకు కెసిఆర్ గారు తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు రైతుబంధు నిధులు పంపిణీ ప్రారంభిస్తారని.. సమాచారం అందుతోంది. పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరానికి… రూ. 5 వేల చొప్పున అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పంటలు సాగు చేసినా… సాగు చేయకపోయినా వ్యవసాయ భూమి ఉంటే రైతుబంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ అవుతాయి.

kcr
kcr

ఈ సారి కోటిన్నర లక్షల ఎకరాలకు ఏకంగా 7,500 కోట్ల రూపాయలను అందించనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ నెల ఆఖరి వరకు నిధులు సర్దుబాటు కాకపోతే డిసెంబర్ మొదటి వారంలో రైతుబంధు డబ్బులు విడుదల కానున్నాయి. కాగా తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలుపై… కాస్త ఆందోళన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయబోమని చెబుతుంటే… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి సీఎం కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లారు. వడ్ల కొనుగోలు పై… కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news