కొడాలి నానికి తెలుగు నేర్పిన వాళ్ళ కాళ్ళు మొక్కుతా : వర్ల రామయ్య

-

వైసీపీ నేతలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి తెలుగు నేర్పిన మాస్టర్ వస్తే కాళ్లకు దండం పెట్టాలని ఉందని ఎద్దేవా చేశారు వర్ల రామయ్య. అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత కేంద్రం చంద్రబాబుకి ఎన్‌ఎస్‌జీ సెక్యూర్టీ ఇచ్చింది.. చంద్రబాబు దేశ సంపద కాబట్టి కేంద్రం ఎన్‌ఎస్‌జీతో రక్షణ కల్పిస్తుందన్నారు.

కొడాలి నానిని ఆడవాళ్లు కొట్టకుండా సీఎం జగన్ సెక్యూర్టీ ఇచ్చారు.. నారా భువనేశ్వరిపై అనవసర వ్యాఖ్యలు చేసినందుకు మహిళల నుంచి కాపాడుతూ కొడాలి నానికి 1+4 సెక్యూర్టీ ఇచ్చారని తెలిపారు. నేను ఓడిపోయినా మంచి పేరు ఉంది.. కొడాలి నాని గెలిచి ఏమి సాధించారు..? అని నిలదీశారు.

చెప్పులు,చీపుర్లతో ప్రజలు కొట్టకుండా పోలీసు రక్షణలో ఉన్న కొడాలి నాని కోసం చంద్రబాబు సెక్యూర్టీ తీసేసి రావాలా..? ఇలాంటి కొడుకును జన్మనిచ్చినదుకు కొడాలి నాని తల్లిదండ్రులు బాధపడుతు న్నారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలే చేయాలని కొడాలి నానిని సీఎం బ్లాక్ చేస్తున్నారని.. కొడాలి నాని ఇకనైనా మనిషిగా బతకడానికి ప్రయత్నించాలన్నారు వర్ల రామయ్య .

Read more RELATED
Recommended to you

Latest news